జర్మనీలోని మ్యునిచ్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పలు దేశాధినేతలతో మోదీ వరుసగా సమావేశమయ్యారు.కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడోతో మోదీ మాట్లాడుతూ మెట్ల మీది నుంచి దిగుతున్నారు. అప్పుడే వెనుక నుంచి వచ్చిన బైడెన్, మోదీ దగ్గరకు చేరుకుని, ఆయన భుజం తట్టి మరీ పలకరించారు. వెంటనే వెనక్కు తిరిగిన మోదీ, బైడెన్ చూసి కరచాలనం చేసి, నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.