జపాన్ లో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్లు అధికారులు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనంతగా జూన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు తెలిపారు. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. టోక్యోలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆ దేశంలో వడదెబ్బ కేసులు పెరిగాయి.