కుప్పంలో సర్పంచ్‌లను, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను, మున్సిపాలిటీని గెలిపించుకునే చవట దద్దమ్మ చంద్రబాబు. సీఎం వైయస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. కొడాలి నానిని గుడివాడలో ఓడిస్తా.. జోగి రమేష్‌ను పెడనలో ఓడిస్తా.. పేర్ని నానిని బందరులో ఓడిస్తా. వంశీని గన్నవరంలో ఓడిస్తా.. అని మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ.. నువ్వు మా వెంట్రుక కూడా పీకలేవు. నువ్వు కుప్పంలో గెలువు ముందు..అని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడకు రా పోటీ చేద్దాం.. నన్ను ఓడిస్తే రాష్ట్రం వదిలేసి వెళ్లిపోతా.. లేకపోతే నువ్వు పార్టీ పీక్కొని పోతావా.. 2004లో, 2009లో, 2014లో, 2019లో గెలిచా.. 2024లో గెలుస్తా.. 2029లో గెలుస్తా.. ఇక్కడే పుట్టా.. ఇక్కడే మట్టిలో కలిసిపోతా.. చంద్రబాబు పుట్టిన ఊరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉందది. చంద్రగిరిలో పెరిగి.. 1978లో చంద్రగిరి నుంచి పోటీ చేశాడు.. మంత్రి అయ్యాడు. 1983లో ఎన్టీఆర్ దెబ్బకు.. చంద్రబాబు ఫుట్బాల్లా గాల్లో ఎగిరాడు. మా కోసం పార్టీ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు. అని విరుచుకుపడ్డాడు