రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అదేశాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం ఐ. వి ప్యాలెస్‌లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైయస్ జగన్ అని తెలిపారు. వైయస్ జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాలన్నారు. నాడు వైయస్ పాలన చూశాం.. ఇప్పుడు వైయస్ జగన్ పాలనను చూస్తున్నాం అని అనందం వ్యక్తం చేశారు. అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే జగనన్న తపన అని వ్యాఖ్యానించారు. విజయవాడ నగరాభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత వైయస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైయస్ జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు అమలు, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కార్యాచరణ, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతానికి ప్రణాళికలపై చర్చించారు. సమావేశంలో నియోజకవర్గ ప్లీనరీ ఇన్ ఛార్జ్ చిల్లపల్లి మోహన్ రావు, పార్టీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, ఎన్ టి ఆర్-కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ మర్రి రాజశేఖర్, ఎన్ టి ఆర్ జిల్లా ప్లీనరీ ఇన్‌చార్జి డొక్కా మాణిక్యవరప్రసాద్, మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేషన్ ఛైర్మన్ లు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.