హుద్ హుద్ తుఫాన్ తర్వాత ఒడిషాకు పదివేల కరెంటు స్థంభాలు, వెయ్యి ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు పంపిస్తున్నట్టు బాబు జాతీయ నాయకుడి రేంజిలో చెప్పుకున్నాడు. అవి తమకు అందనే లేదని తర్వాత ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. దొంగ బిల్లులు రాసి పంచుకున్న దాంట్లో 'గంజాయి' పాత్రుడే కింగ్ పిన్ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలానే ప్రతి ఊరిలో 2 అన్న క్యాంటీన్లు పెట్టి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో బాబూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే అస్సాం వరద బాధితులకు వెయ్యి లారీల నిత్యావసర సరుకులు పంపించు. ఎక్కడ వరదలొచ్చినా లైవ్ కవరేజి పెట్టించుకుని జెండాలూపేవాడివి. ఆ ట్రక్కులు పార్టీ ఆఫీసుకే తిరిగొచ్చేవి. ఫ్రీ పబ్లిసిటీ దొరికేది అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.