అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు, విద్యాదీవెన, బైజూస్ ద్వారా డిజిటల్ కంటెంట్ వంటి పథకాల ద్వారా రాష్ట్ర విద్యావ్యవస్థ రూపురేఖలను సమూలంగా మారుస్తున్నారు సీఎం జగన్ అని వైసీపీ నాయకులూ తెలియజేసారు. వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో ప్రవేశ పెట్టిన విప్లవాత్మక చర్యల వల్ల 2018-19 సం'లో ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 7 లక్షలకు పైగా పెరిగి 2021-22 నాటికి 44.30 లక్షలకు చేరిందని , దానికి కారణం నాడు నేడు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని తెలియజేసారు.