కరోనా విజృంభణతో దాదాపు 6 నెలలుగా కఠిన ఆంక్షలతో చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. జీరో కొవిడ్ లక్ష్యంగా అధికారులు కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలు చేయడంతోపాటు భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో కేసులు తగ్గుతూ వచ్చాయి. సోమవారం దేశవ్యాప్తంగా కేవలం 22 కేసులు మాత్రమే నమోదైనట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ తెలిపింది. దీంతో అధికారులు కరోనా ఆంక్షలు సడలించారు.