జపాన్ లో సాగుచేసే మియాజాకి అనే మామిడిపండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా చెప్పుకుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత తీపిగా ఉండే మామిడి పండు. ఇప్పుడు దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.70 లక్షలకు పలుకుతోంది. 350 గ్రాములు ఉండే ఈ పండులో చక్కెర 15 శాతంగా ఉంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ రకం మామిడిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ రైతు సాగు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa