ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ రూల్ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, చాకెట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్క్రీమ్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్ లు, స్పూన్లు, స్ట్రాలు, ఫుడ్ ప్యాకింగ్ కు వాడే పల్చటి ప్లాస్టిక్, మరికొన్ని వస్తువులు నిషేధిత లిస్ట్ లో ఉన్నాయి.