కరోనా, మంకీపాక్స్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్న వేళ మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ లో వరుసగా అంటువ్యాధులు వెలుగు చూస్తుండడంతో రానున్న రోజుల్లో డిసీజ్ ఎక్స్ (Disease X) వంటి కొత్త వ్యాధికారకాలను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. డిసీజ్ ఎక్స్ అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధి అని, అది ఏ రకమైన వ్యాధి అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు.