అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ బి.వెంకటేశ్వర్లు, అనంతపురం సిసిఎస్ డిఎస్పి మహబూబ్ బాష , ఉరవకొండ సిఐ బి.శేఖర్ ఆధ్వర్యంలో విడపనకల్ ఎస్ఐ కె.సురేష్ బాబు, సిబ్బంది మరియు సెబ్ పోలీసులు సీజ్ చేసిన అక్రమ మద్యంను ధ్వంసం (destruction) చేశారు. 240 NDPL మద్యం కేసుల్లో వున్న 42,564 మద్యం ప్యాకెట్లు మరియు బాటిళ్లలో వున్న 5,724 లీటర్ల మద్యం విలువ 23,46,667/- గల మద్యమును విడపనకల్ నుండి వి.కొత్తకోట కు పోవు దారి ప్రక్కన వున్న బయలు స్థలములు JCB ద్వారా ద్వంసం చేశారు.