రహదారి ప్రమాదాల నివారణకు విశిష్ట కృషి చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తూ, సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నది లేనిది, ప్రతి ఒక్కరు రహదారి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నది లేనిది తనిఖీ చేస్తున్నారు. దీని వలన ప్రమాదాలను అరికట్టే అవకాశం కలదు అలానే వాహన దొంగతనాలను కూడా అరికట్టగలము ధీమా వ్యక్త పరిచారు. వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలానే, తగిన పేపర్స్ ఉండాలి, ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ తప్పసరి అని తెలియజేసారు. ఇవి లేకుండా వాహనాలు నడుపువారికి తగిన జరిమానా వేస్తాం అని హెచ్చరించారు.