ఏపీలో రాజధాని రైతులకు వార్షిక కౌలును సీఆర్డీఏ మంజూరు చేసింది. భూములు ఇచ్చిన రైతులు, వ్యక్తులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.208 కోట్లను విడుదల చేసింది.
దీని నుంచి సుమారు 23,000 మందికి రూ.184 కోట్లను వారి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ నెల 27న రూ.112 కోట్లు, ఈ నెల 28న రూ.72 కోట్లు జమ చేశారు. ఈసారి కూడా వివాదాలు, విచారణలో ఉన్న భూములను మినహాయించారు.