తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. హాజిరాలో రెండు రోజుల క్రితం బాలిక ఇంటిముందు ఆడుకుంటుండగా తన బంధువు కల్లు రాఠోడ్ వచ్చి బాలికను రైల్వే బ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం రాయితో కొట్టి హత్య చేసి పొదల్లో మృతదేహాన్ని పడేసి పరారయ్యాడు. బాలికను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు.