మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గురువారం జరుగనుంది. ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించారు. రేపు సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్షకు డెడ్ లైన్ విధించారు.
ఈ మేరకు సీఎం ఉద్ధవ్ కు గవర్నర్ లేఖ రాశారు. ఇక ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబైకి చేరుకోనున్నారు. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.