జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో నూతనంగా తీసుకువచ్చిన విధానమే సచివాలయ వ్యవస్థ. ప్రతి గ్రాంలో ప్రజలకి సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఇది ఏర్పాటు చేసినట్లు జగన్ తెలియజేసారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రొబేషన్ పూర్తియైన సందర్బంగా పల్నాడు జిల్లా, ఎస్పీగారిని జిల్లా పోలీస్ కార్యాలయములో మర్యాదపూర్వకముగా కలసి, శాలువాతో సత్కరించిన పల్నాడు జిల్లా సచివాలయ ఉద్యోగులు. ప్రొబేషన్ పూర్తిచేసుకున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపి, ప్రజలకు నాణ్యమైన సేవలు నిర్భయంగా,నిష్పక్షపాతంగా అందించాలని సూచించిన ఎస్పీగారు.