ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న వైయస్ జగన్ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది అని మంత్రి రోజా తెలియజేసారు. నగరి నియోజకవర్గ ప్లీనరీలో మంత్రి రోజా మాట్లాడుతూ... 12 ఏళ్లలో ఎన్నో ఆటు పోట్లు, ఎన్నో తప్పుడు కేసులు, నింపితే..అన్నింటిని ఎదురించి నిలబడిన దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. వైయస్‌ఆర్ బ్లెడ్‌కాబట్టి ఎవరికి బెదరలేదు. ఈ రోజు వెన్నుచూపకుండా పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా, అందరిని ఒక తాటిపై నిలబెట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఆయన ఆశయాల పునాదుల మీద వైయస్‌ఆర్ జెండాను వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాటారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై వైయస్‌ఆర్‌సీపీని చంపేయాలని, చిదిమేయాలని, అడ్రస్ లేకుండా చేయాలని చూశారు. కానీ వైయస్ జగన్ మొక్కవోని ధైర్యంతో, మీ అందరి సహాయ సహకారాలతో 12 ఏళ్లు పోరాటం చేశారు. ఇద్దరితో ప్రారంభమైన వైయస్‌ఆర్‌కాంగరెస్ పార్టీ ఈ రోజు దేశంలోనే అతిపెద్ద నాలుగోవ పార్టీగా నిలబెట్టారు. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. అందరి చరిత్రను తిరగరాసిన చరిత్రకారుడు వైయస్ జగన్. ఎంతో మంది సీఎంలు దేశంలో ఉన్నారు. ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించిన వ్యక్తి వైయస్ జగన్. మొదటిసారి సీఎం అయినా పెద్ద మనసుతో పేదల కష్టాలను దూరం చేయాలని కుటుంబ పెద్దగా భావించి అన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ సామ్రాట్ వైయస్ జగన్ అని కొనియాడారు.