ఏపీ రైల్వే ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని పలు ప్రాంతాల మధ్య నడిచే ఏడు రైళ్లను జులై నెల నుంచి పునరుద్ధరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలను ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి–కాట్పాడి, కాట్పాడి--తిరుపతి, గుంటూరు–విజయవాడ, తెనాలి–గుంటూరు, మార్కాపూర్ రోడ్ –తెనాలి, నంద్యాల్ –కడప, కడప–నంద్యాల్ ఈ రూట్ లలో రైళ్ళు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.