కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, నాయకుల కష్టంతోనే వైయస్ఆర్సీపీ ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించి పార్టీ జెండా రెపరెపలాడుతోందని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని వైయస్ఆర్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారన్నారు. వారి కష్టాన్ని పార్టీ ఎప్పటికీ విస్మరించదన్నారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.