మంగళవారం నుంచి ఆషాఢమాసం ప్రవేశించడంతో శుభ ముహూర్తాలకు బ్రేక్ పడింది. 3 నెలలుగా కళకళలాడిన పెళ్లి మండపాలు నెలరోజుల పాటు వేచి చూడాల్సిందే. ఆషాఢ మాసంతో జూలైలో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 3 నుంచి శుభముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్రమూఢం ఉంది. ఈ 3 నెలలు శుభముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది.