ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8వేల కోట్లతో 16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తుండటం అభివృద్ధి కాదా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 29, 2022, 03:17 PM

‘పేద పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. తీర్చిదిద్దాలని, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, బైజూస్‌ వంటి విప్లవాత్మక కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు అని గుడివాడ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో కొడాలి నాని మాట్లాడుతూ.... ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యను అభ్యసించాలి. పేద పిల్లలు గ్రామాల్లో ఉండిపోకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం, వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు.చంద్రబాబును ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకే పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్, చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని దోచుకుతినొచ్చు, దొంగళ్లా పంచుకోవచ్చు అని ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌నాయుడు డిబేట్లు పెడతారు.. పేపర్లలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలతో సంపదను పేదలకు పంచుతున్నాడని మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. రూ.8వేల  కోట్లతో 16 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తుండటం అభివృద్ధి కాదా.. 20వేల కోట్లతో నాడు–నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరిస్తే అభివృద్ధి కాదా..? రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, అత్యాధునిక పరికరాలు సమకూర్చడం, నూతన బిల్డింగ్‌లు నిర్మించడం అభివృద్ధికాదా..? చదువుకున్న పిల్లలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఉద్యోగం కల్పించడం, ఆర్బీకే, వైయస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ ఇవన్నీ అభివృద్ధి కాదా..? అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com