పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జలశక్తి మంత్రికి బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రాజెక్టుకు సాంకేతింగా జరిగిన నష్టంపై లేఖలో ప్రస్తావించారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో వెంటనే స్పందించి పోలవరం సత్వర పూర్తికి సహకరించాలని లేఖలో వెల్లడించారు.