కృష్ణ జిల్లా, జి కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరం లో నమోదైన అత్యాచారం కేసులో నేరస్తునికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000/- రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు మచిలీపట్నంలోని 9 వ న్యాయస్థానం న్యాయమూర్తి Dr. షేక్ మహమ్మద్ ఫజుల్లా గారు తీర్పును వెలువరించారు. దేనితో బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది అని సంతోషం వ్యక్త పరిచారు. ఈ సందర్భముగా పోలీస్ వారు మాట్లాడుతూ.. తప్పు చేస్తే శిక్ష పడటం కొంచెం లేట్ అవుతుందేమో కానీ కచ్చితంగా న్యాయస్థానం నుండి ఎవరు తప్పించుకోలేరు. దేనిని దృష్టిలో పెట్టుకొని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అందరూ జీవించాలని హితవు పలికారు.