ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలలో జగనన్న విద్యాకానుక ఒకటి. విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
జూలై 5వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదోనిలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కిట్లు విద్యార్థులకు పంపిణి చేయబడతాయి.