నేపాల్ రాజధాని కాఠ్మండూ, లలిత్‌పుర్ లో పానీపూరీతో పాటు వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలపై అధికారులు నిషేధం విధించారు. గత వారం రోజులుగా పలు నగరాల్లో కలరా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా కలరా వ్యాపిస్తుంది కావున, తొలిదశ లోనే వ్యాధిని కట్టడి చేసేందుకు వీటిని బ్యాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార పరిశుభ్రతపై ముమ్మర తనిఖీలు జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa