ట్విట్టర్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. జులై 4వ తేది వరకూ తమ ఆదేశాలను పాటించాలని తెలిపింది. నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ట్వీట్లను తొలగించాలని కేంద్రం ఇదివరకే కోరింది. దీంతో 80కిపైగా అకౌంట్లు, ట్వీట్ల జాబితాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. తమ ఆదేశాలను జులై4 వరకూ పాటించాలని కేంద్రం కోరింది.