జనసేన పార్టీ క్షేత్రస జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరిస్తామన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. జులై 2న జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వీర మహిళలు ఈ తరగతులకు హాజరు అవుతారని ఆయన తెలిపారు. ఈ పునశ్చరణ తరగతుల్లో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారన్నారు. పార్టీకి మరింత ఉత్తేజం నింపేలా, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే విషయాలను వివరిస్తారని, భవిష్యత్ కార్యాచరణను విపులంగా చెబుతారని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పనిచేయాలో చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.