కళ్యాణదుర్గం మండల కేంద్రంలో బుధవారం, గురువారం రేషన్ కార్డుల నమోదు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అర్హులైన వారికి నమోదు చేయించి, వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను చేరే విధంగా కృషి చేయాలని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఫణీ సూచించారు. కార్యకర్తలు తమ పరిధిలో అర్హులైన వారికి రేషన్ కార్డు నమోదు కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలన్నారు.