పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే నిత్యావసర సరుకులను సక్రమంగా అందించాలని ఆర్డీఓ రవీంద్ర తెలిపారు. మంగళవారం గుంతకల్లు స్థానిక మున్సిపల్ బాలుర హైస్కూల్ లో డీలర్లు, వీఆర్వోలు, ఎండియూ ఆపరేటర్లతో సమన్వ య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన పథకాన్ని అమలుచేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. లబ్ధిదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు.