వెలిగండ్ల మండల పోలీస్ స్టేషన్ ను బుధవారం దర్శి డీఎస్పీ వి.నారాయణ స్వామి వార్షిక తనిఖీలో భాగంగా.. బుధవారం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
గ్రామాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచాలని.. పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఎస్ఐ పి.విశ్వనాథరెడ్డి, సచివాలయం మహిళా పోలీసులు పాల్గొన్నారు.