ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నందు బుధవారం అంగన్ వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ పాల్గొని మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర ధరలు పెరుగుతున్నాయే తప్ప.. గత నాలుగు సంవత్సరాల నుండి అంగన్ వాడి వర్కర్లకు జీతాలు పెరగలేదన్నారు.