సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. జిల్లా వైసీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. బుధవారం ఒంగోలులో జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి ఓర్వలేకనే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.