--- చిన్నపిల్లలకు జలుబు వెంటనే తగ్గాలంటే ఒక్కసారి ఇలా చెయ్యండి. జలుబు నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఇందుకోసం వంటింట్లో ఉండే వాము సరిపోతుంది. భగభగ మండే నిప్పులపై వామును వేసి వచ్చే పొగను పిల్లలు పీల్చేలా చెయ్యండి. జలుబు చేసి ఊపిరాడక ఇబ్బంది పడే పిల్లలకు రాత్రి పూట ఇలా చేస్తే హాయిగా నిద్రపోతారు.
--- మనలో కొంతమంది మాటిమాటికి తుమ్ముతూ ఉంటారు. ఇదొక రకమైన ఎలర్జీ. దీని నుండి విముక్తి పొందడానికి ఆహారంలో పసుపు, అల్లం, జీలకర్ర ను తప్పకుండా చేర్చుకోవాలి.
--- ఎందుకో తెలియదు... ఒక్కోసారి మనలోని బలమంతా పోయి చాలా నీరసంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చిన్న అల్లం ముక్కను చితక్కొట్టి నిమ్మరసంతో కలిపి తింటే నీరసం తగ్గి తిరిగి చురుగ్గా మారవచ్చు.