శివసేనకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎంగా ఏక్ నాథ్ షిండే అనర్హుడంటూ సుప్రీంలో శివసేన పిటిషన్ వేసింది. దీని పై అత్యవసరంగా విచారించాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీం దీనికి అత్యవసర విచారణ అవసరం లేదని జూలై 11న విచారణ చేస్తామంది. తుది తీర్పు వచ్చే వరకు రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించవద్దు అని శివసేన కోరగా దానికి సుప్రీం తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa