3 రాజధానులు నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూములను అమ్మడo ఏమిటని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రశ్నించారు.
పెదనందిపాడు లో ఆయన మాట్లాడుతూ రాజధాని లోని భవనాలను లీజుకివ్వడం అక్రమ మని ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్యేలకు కేటాయించిన భవనాలను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని హైకోర్టు చెప్పిందని, అసెంబ్లీ, సచివాలయంను అమరావతిలో ఉంచాలన్నారు.