కొల్లిపర: చదువులో వెనుకబడ్డానన్న దిగులుదో తమ కుమార్తె ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు మున్నంగి గ్రామానికి చెందిన ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కుమార్తె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది.
గురువారం రాత్రి అందరితో పాటే ఆమె కూడా భోజనం చేసి పడుతుంది. ఉదయం చూస్తే తన కుమార్తె కనిపించలేదని ఆమె తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్సై బాలరామిరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.