ఏపీలోని కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలో శనివారం తెల్లవారుజామున విషాధం జరిగింది. పూరి గుడిసెకు నిప్పంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో తల్లి సాదనాల మంగాదేవి, కుమార్తె మేడిశెట్టి జ్యోతి నిద్రలోనే సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం అనుమానాస్పదం కావడంతో అల్లుడు మేడిశెట్టి సురేష్‌ను అల్లవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.