చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని కారణంగా బరువు పెరగడం, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, గ్యాస్ ఎసిడిటీ, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు ఉన్నాయి. తినడానికి, నిద్రించడానికి మధ్య కనీసం 3 నుండి 4 గంటల గ్యాప్ ఉండాలి. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోవచ్చు.