కోనసీమ జిల్లాలో కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపునీటిలో వింత పసుపురంగు కప్పలు వచ్చి చేరాయి. ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. అయితే ఇవి సాధారణ కప్ప లేనని మగ కప్పలు ఆడ కప్పల కోసం రంగులు మార్చి తిరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు.ఖాకీ, ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండే ఈ కప్పలు బ్రీడింగ్ సీజన్లో సడెన్‌గా పసుపురంగులో మారతాయి. ఇలా పసుపు రంగులో మారేవన్నీ మగ కప్పలేనట.