వైసిపి నాయకుల సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారింది అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్త పరిచారు. తాజాగా ఏలూరులో జరిగిన ఒక సంఘటన మీద స్పందిస్తూ... అధికార మదంతో ఏలూరులో నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన డ్రైవర్ పై దాడి చెయ్యడం దారుణం. వైసిపి కార్పొరేటర్ స్రవంతి గారికి నమస్కారం పెట్టలేదని ఆమె, ఆమె భర్త నాగరాజు, వారి అనుచరులు కలిసి రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాస్ పై రోకలి బండ తో దాడికి పాల్పడ్డారు. శ్రీనివాస్ పై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలి అని డిమాండ్ చేసారు.