అనంతపురం జిల్లా, ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS జిల్లాలోని డీఎస్పీలతో ఈరోజు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి కిరాయి హంతకులు, యాక్టివ్ గా ఉన్న రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై సమీక్ష చేశారు. వీరిపై నిఘా ఉంచాలని... మళ్లీ నేరాల జోలికి వెళ్లకుండా అర్హులైన రౌడీషీటర్లు, కిరాయి హంతకులకు కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. నేరాల జోలికెళ్లడం, మళ్లీ పాత పంథా కొనసాగిస్తే చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలన్నారు.