జగన్ మోసపు రెడ్డి బాదుడే బాదుడుకి కులం, మతం, ప్రాంతం లేదు. రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమే అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ వాపోయారు. పెంచిన బస్సు చార్జీల దృష్ట్యా ఆయన మాట్లాడుతూ... పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ ప్రెస్ లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారు. రెండో విడత బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లు పేదల నుండి కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం. ఆఖరికి విద్యార్థుల బస్సు పాసులను కూడా వదలకుండా బాదేయడం దారుణం. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తానన్న జగన్ మోసపు రెడ్డి ఇప్పుడు సంస్థ ఉనికినే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని ప్రజలకి దూరం చేస్తున్నారు అని అన్నారు.