అక్రమ మద్యం కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు ఈనెల 3 వ తేదీన వేలం నిర్వహిస్తున్నామని అనంతపురం 4 వ పట్టణ CI ఒక ప్రకటనలో తెలియజేశారు. స్థానిక పోలీసు స్టేషన్ ఆవరణలో ఆ రోజు ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తామని..ఆసక్తి ఉన్న వారు అదే రోజున ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. వేలంలో నెగ్గాక నిర్ణయించిన మొత్తమును సంబంధిత అధికారులకు చెల్లించి వాహనాలు స్వాధీనపరచుకోవచ్చన్నారు. వేలం వేయబడు వాహనాల యొక్క వివరాలను కింద తెలిపామన్నారు. 2 కార్లు, 5 ద్విచక్ర వాహనాలకు వేలం నిర్వహిస్తామన్నారు.