ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెంచిన చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 12:46 PM

డీజిల్ సెస్ పేరిట సామాన్య ప్రయాణీకులపై అంతు లేని భారం మోపడం జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం. నిత్యం 65 లక్షల మంది ప్రజలను వారి, వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసే ఆర్టీసీ వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి  భ్రష్టు పట్టించారు అని టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తపరిచారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని, అవగాహన లేని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అది సాధ్యపడదని తెలిసి కేవలం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని చెప్పి చేతులు దులుపుకున్నారు  జగన్ మోహన్ రెడ్డి. పేదవాడి రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సును రానున్న రోజుల్లో కనుమరుగు చేయడానికి పన్నిన కుట్రలో భాగమే ఈ చార్జీల పెంపు. కావున  పెంచిన చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com