పాడేరులో జరిగిన అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ పార్టీ ప్లీనరీలో పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ ప్లీనరీలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్లీనరీ పరిశీలకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్యే లు చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాం లో సకల అరాచకాలు, దాష్టీకాలు, ముఠాపాలన, నిరంకుశత్వం కొనసాగాయన్నారు. ఈ సమావేశం లో మంత్రి జోగి రమేష్, విప్ సామినేని ఉదయభాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, రక్షణ నిధి, మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీలు కల్పలత, డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు.