అమెరికాలో తుపాకుల సంస్కృతితో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఫ్లాయిడ్ కౌంటీ ప్రాంతంలోని కెంటకీలో స్థానిక పోలీసులు తనిఖీలకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా వారిపై అగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు. ఓ పోలీసు జాగిలం కూడా మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. కాల్పులు జరిపిన లాన్స్ స్టోర్జ్ (49)ను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa