మహిళలు భద్రతకు దిశ యాప్ అత్యవసరం అని రాజాం పోలీసులు చెబుతున్నారు. దిశా యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక ఐపిఎస్ ఆదేశాల మేరకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్ ల పరిధిలో దిశ యాప్ మెగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ కార్యక్రమాన్నీ చేపడుతున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టి, దిశ యాప్ యొక్క ఆవశ్యకత తెలిపి ప్రతి మహిళ మరియు విద్యార్థులు దిశా యాప్ ను వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసువారి తక్షణ సహాయం పొందాలన కోరారు.