ఆత్మకూరు: రాష్ట్రంలో పెంచిన ఆర్టీసి బస్సు చార్జీలు తగ్గించే వరకు పోరాడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏసు రత్నం పేర్కొన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం ఆత్మకూరు ఆర్టీసి బస్టాండ్ ఎదుట ధరల భూతంను దగ్ధం చేశారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రణధీర్, స్వాములు తదితరులున్నారు.