ఆత్మకూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్టీసి బస్సు చార్జీలను భారీగా పెంచుతూ వైసిపి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందని ఆత్మకూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు వేణు, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ఆర్టీసి చార్జీలకు నిరసనగా శనివారం ఆత్మకూరు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రయాణికులకు సిఎం జగన్ బాదుడే బాదుడు గురించి వివరించారు.