తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా టీడీపీ సెల్ అధ్యక్షులు సాతులూరి కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం బలహీన వర్గాల వారి పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు తో కలసి చదలవాడ అరవింద్ బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య పాల్గొని, మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ప్రతి నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దాడులు జరగడం సాధారణంగా మారింది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా భద్రత సైతం వారికి దూరమైంది. ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా నిధులు లేదు. అదే విధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి బలహీనవర్గాల వారికి సరైన ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లు ఇవ్వడం లేదు. అదే విధంగా పోలీస్ శాఖలోనూ ఇబ్బందులు పడుతున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ కలిసి వినతిపత్రం అందజేసాము.